Header Banner

తస్మాత్ జాగ్రత్త! రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ క్రైమ్స్! రూ 6.8 కోట్లు టోకరా!

  Sun May 25, 2025 14:17        Others

ఒక రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి కృష్ణన్ కుమార్ కౌశల్‌కు నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్ ద్వారా భారీ మోసం జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన తమిళనాడులో 2024లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా పదవీ విరమణ చేశారు. దీని తర్వాత వాట్సాప్‌లో వచ్చిన సందేశాల ద్వారా 'SMC Apex', 'Shanda Capital' అనే నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసి, అధిక లాభాలు వస్తాయని నమ్మి రూ.6.8 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. యాప్‌లో చూపిన లాభాలు నిజమైన స్టాక్ మార్కెట్ గణాంకాలతో సరిపోలకపోవడం వల్ల అనుమానం వచ్చిన ఆయన, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

 

దర్యాప్తులో, చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు కేరళకు చెందిన ముగ్గురు నిందితులు శ్రీజిత్ ఆర్.నాయర్, అబ్దుల్సాలు, మహమ్మద్ ఫర్వాయిజ్‌లను  అరెస్ట్ చేశారు. వీరు మోసగాళ్లకు సహకరిస్తూ బ్యాంకు ఖాతాలు నిర్వహించడంతో పాటు, హవాలా మార్గం ద్వారా డబ్బును విదేశాలకు తరలించి, బినాన్స్ ట్రేడింగ్ యాప్ ద్వారా USDT (క్రిప్టోకరెన్సీ)గా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీలో ఐదుగురు అరెస్టు కాగా, ఈ ముగ్గురూ డబ్బు తరలింపులో కీలక పాత్ర పోషించినట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఇదే తరహా మోసాలకు వీరు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #andhrapravasi #CyberCrime #OnlineFraud #RetiredOfficials #InvestmentScam #FakeTradingApps